Wednesday, September 23, 2020

EPS 95 Pensioner Information: Information A V Ramana rtd DMO APCO President Weavers Welfare Council.

A V Ramana rtd DMO APCO President Weavers Welfare Council.
Let all the people of back word community, perticularly Weaver community remember the dedicated services rendered by the great leader late Konda lakshman Bapuji garu on his 8th Vardhanti day.

He established erstwhile Hyco Fabrics to provide employment to the Weaver members of primary Weavers co-op societies during the year 1956 and arranged marketing to their products through sales units opened throughout our country. After merger of 3 apex Societies namely Andhra Hand loom, Hyco Fabrics and Raya Fabrics in to one registered as APCO Fabrics, Konda lakshman Bapuji was elected to the managing committee of Apco representing Nalgonda district during the first election after formation of APCO during the year 1978. 


Bapuji garu established Weavers Trust for the welfare of the Weavers duly constructing Padmasali Bhavan in the heart of the City near the APCO Bhavan. Bapuji garu is freedom fighter faught for the liberation of Hyderabad.

Bapuji garu was expected to be elected at one stage to the Post of Chief Minister and Unfortunately the proposal was set aside on the ground that he hails from backward community. 


Bapuji garu offered his house to TRS Office and faught sincerely for the seperate Telangana State. But his dedicated service is not recognised by the upper caste people following his BC entity. Bapuji garu would be remembered in the hearts of back ward community for ever in the past present and future generations.

Let us all pay homage to Our Departed leader Konda lakshman Bapuji on his 8 th Vardhati day. Let us hope that Telangana state government install the statues of our beloved Departed leader Konda lakshman Bapuji garu one on Tank Bund and Second in Assembly Premises after Construction of the same.


I took prevelage of forwarding the message sent on the accation of 8th Vardhati day, by Dasu Suresh Garu, Chairman of Bapuji Aasaya Sadhna Samithi to all leaders, groups organisations and Cheneta mitra and other related magazines of weavers and back ward community.

TELGU TRANSLATION IS AUTOMATIC MAY SOME MISTAKE FOR THAT INCONVENIENCE CAUSE REGRETTED.

READER CAN CORRECT IT AND POST IT IN COMMENT BELOW.

కొండా లక్ష్మణ్ బాపూజీ పై ముఖ్యమంత్రి ముసలి కన్నీరు - దాసు సురేష్ 

నివాళులు నిజమైతే బాపూజీకి మీరిచ్చిన హామీలు ఎక్కడబాయే..?

కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,నలుగురు మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు ఘనమైన నివాళులు అర్పించడం ఆహ్వానించదగ్గ పరిణామమని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి చైర్మన్ దాసు సురేష్ అభిప్రాయపడ్డారు 

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని స్వరాష్ట్రమొచ్చి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా స్థాపించక పోవడానికి గల కారణమేమిటని దాసు సురేష్ ప్రశ్నించారు. బాపూజీ నివాసమున్న ,టీఆర్ఎస్ పార్టీకి జన్మస్థానమైన జలదృశ్యాన్ని బాపూజీ స్మారక నాలెడ్జ్ పార్క్ గా ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఎటుపోయిందో ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని దాసు సురేష్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గతంలోహామీ ఇచ్చిన విధంగా జలదృశ్యంలోబాపూజీ స్మృతి ఏర్పాటు చేయకుండా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ఏమిటని ప్రశ్నించారు.


పీవీ నరసింహారావు గారికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా భారతరత్న ప్రతిపాదించగా అంతే ఘనకీర్తి కలిగిన తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీలలో పుట్టడమే భారతరత్న బిరుదుకు అనర్హుడిని చేసిందా అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూటి ప్రశ్నను సంధించారు.

తెలంగాణ ప్రభుత్వం బాపూజీ నెలకొల్పిన చేనేత , చేతివృత్తుల సహకార సంఘాలు, కార్పొరేషన్లను, ఫెడరేషన్ లను నిర్వీర్యం చేయడం సహేతుకమేనా అని ప్రశ్నించారు. బీసీలకు ప్రత్యేక తెలంగాణలో రాజకీయ అవకాశాలు 34 శాతం నుండి 18 శాతానికి ఎందుకు తగ్గాయో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని ,బాపూజీ కలలుగన్న సామాజిక ,స్వాభిమాన తెలంగాణలో దళితులపై దాడులు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని దాసు సురేష్ డిమాండ్ చేసారు . 


ఈ ప్రశ్నలన్నింటికీ ఈనెల 27వ తేదీన జరగబోయే కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతికి ముందు ముఖ్యమంత్రి సమాధానం చెప్పి ,ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రభుత్వం తన సచీలతను నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

0 Post a Comment:

Post a Comment